mictv telugu

పోలీస్ స్టేషన్ ముందు ఆత్మహత్యయత్నం చేసిన ఎమ్మెల్యే

January 7, 2019

తన నియోజకవర్గ ప్రజల సమస్యలు తీర్చాల్సిన ఎమ్మెల్యేనే ఆత్మహత్య యత్నం చేయడం ఏంటి అనుకుంటున్నారా? అవును మీరు చదువుతుంది నిజమే.. పోలీసుల ఒత్తిడి తట్టుకోలేక ఒక ఎమ్మెల్యే ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డాడు. తన అనుచరులను పోలీసులు అనవసరంగా దొంగ కేసులు పెట్టి వేధిస్తున్నారని ఆరోపిస్తూ ఒక ఎమ్మెల్యే ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. వివరాల్లోకి వెళితే కర్ణాటక రాష్ట్రంలోని హోసదుర్గ నియోజకవర్గానికి చెందిన బీజేపీ ఎమ్మెల్యే గోలిహట్టి శేఖర్ ‘తన అనుచరులను గత కొన్ని రోజులుగా పోలీసులు దొంగ కేసులు పెట్టీ వేధిస్తున్నారని’ ఆయన ఆరోపించారు.Telugu News Karnataka BJP MLA attempts suicide over alleged harassment of supportersతన అనుచరులపై ఇసుక మాఫియా అని ముద్ర వేసి వేధిస్తున్నారని ఆరోపించారు. తన కార్యకర్తలు, అనుచరుల కోసం ప్రాణత్యాగం చేయడానికి అయినా సిద్దమే అంటూ పొలిసు స్టేషన్ ముందే నిప్పు అంటించుకున్నాడు. పోలీసుల ఆగడాలకు వ్యతిరేకంగా పోలీస్ స్టేషన్ ముందు జరుగుతున్న నిరశన కార్యక్రమంలో ఆయన ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పు అంటించుకున్నారు. ఘటనాస్థలిలో ఉన్న నిరసనకారులు వెంటనే ఆయనను హాస్పిటల్‌కు తీసుకొని వెళ్లడంతో పెద్ద ప్రమాదదం తప్పింది.