నామినేషన్  దాఖలు చేసిన సాయికుమార్ - MicTv.in - Telugu News
mictv telugu

నామినేషన్  దాఖలు చేసిన సాయికుమార్

April 24, 2018

సినీ నటుడు సాయికుమార్ ఈ రోజు  నామినేషన్ దాఖలు చేశారు. ఆయన బీజేపీ అభ్యర్థిగా చిక్కబళ్లాపురం జిల్లా బాగేపల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కర్ణాటక ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. మొదట కర్ణాటక బీజేపీ అధిష్టానం సాయికుమార్‌కు బీ-ఫాం ఇవ్వలేదు. దీంతో ఆయన అనుచరులు ఆందోళనకు దిగారు.

యడ్యూరప్ప నివాసం ఎదుట బైఠాయించి ఆందోళన నిర్వహించారు. అంతేగాక యడ్యూరప్ప ఇంటిముందు ఏర్పాటుచేసిన బారికేడ్లను తోసుకుని ఆయన ఇంట్లోకి  వెళ్లేందుకు ప్రయత్నించారు. ఇదిలా ఉండగా సాయికుమార్ అనుచరులతో యడ్యూరప్ప చర్చలు జరిపారు. సాయికుమార్‌కు టికెట్ కేటాయిస్తున్నామని, అయితే  కొన్ని కారణాల వల్ల ఆయన పేరు ప్రకటించలేమని పేర్కొన్నారు. దీంతో అనుచరులు శాంతించారు. మరోవైపు స్థానికుడైన సి. కృష్ణారెడ్డికి టికెట్ ఇస్తారని ప్రచారం జరిగినప్పటికీ బీజేపీ అధిష్టానం చివరికి  సాయికుమార్‌కే బీ-ఫాం టికెట్ ఇవ్వడంతో మంగళవారం ఆయన తన నామినేషన్‌ను దాఖలు చేశారు.