తప్పనిసరిగా కన్నడ నేర్చుకోవాలి   - MicTv.in - Telugu News
mictv telugu

తప్పనిసరిగా కన్నడ నేర్చుకోవాలి  

November 2, 2017

కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య  మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. కర్ణాటకలో ఉండేవారంతా  తప్పనిసరిగా కన్నడ భాష నేర్చుకోవాలని స్పష్టం చేశారు.  కర్ణాటక రాష్ట్రానికి ప్రత్యేక జెండా కావాలని ఇంతకు ముందే సిద్దరామయ్య డిమాండ్ చేశారు.

కర్ణాటకలోని  ప్రతి ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు తప్పనిసరిగా  కన్నడ భాషను నేర్పించాలని ఆయన ఆదేశించారు.  కన్నడిగుడిగా జీవించాలన్నా, కర్ణాటకలో ఉండాలన్నా, ప్రతి ఒక్కరు కన్నడ నేర్చుకోవాలని ఆయన కరాఖండిగా చెప్పారు. తన నిర్ణయం దేశంలో  ఏ వర్గానికి, కులానికి, మతానికి వ్యతిరేకం కాదని అన్నారు. ‘నేను ఇతర భాషలను నేర్చుకోవడం, మాట్లాడడాన్ని వ్యతిరేకించను.  దేశభాషలో హిందీ కేవలం ఒక భాషనే కానీ జాతీయ భాష కాదని’ ఆయన అన్నారు.  

కన్నడిగుడిలపై హిందీ భాషను ఎవరు బలవంతంగా రుద్దే ప్రయత్నం చేయద్దని సీఎం హెచ్చరించారు. సిద్దరామయ్య చేసిన వ్యాఖ్యలపై ప్రతిపక్షాలు తీవ్రంగా మండిపడుతున్నాయి.