డీజీపీగా తొలిసారి మహిళ - MicTv.in - Telugu News
mictv telugu

డీజీపీగా తొలిసారి మహిళ

October 31, 2017

కర్ణాటక రాష్ట్ర డీజీపీగా నీలమణి రాజు అనే మహిళ నియమితులు కానున్నారు. ఒక మహిళ  ఈ రాష్ట్ర డీజీపీగా నియమితులు కానుండడం ఇదే తొలిసారి. ప్రస్తుత డీజీపీ రూపక్ కుమార్ దత్తా మంగళవారం పదవీ విరమణ పొందారు. దాంతో ఆయన స్థానంలో నీలమణి రాజు బాధ్యతలను స్వీకరించనున్నారు. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య, హోం మంత్రి రామలింగారెడ్డి సంయుక్తంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రభుత్వం వర్గాలు  వెల్లడించాయి.   నీలమణి రాజు  స్వస్థలం ఉత్తరాంఖండ్. ఆమె 1983 ఐపీఎస్  బ్యాచ్‌కు చెందించినవారు.