కర్ణాటక పోలింగ్ మే 12న.. ముందే లీక్ చేసిన బీజేపీ నేత - MicTv.in - Telugu News
mictv telugu

కర్ణాటక పోలింగ్ మే 12న.. ముందే లీక్ చేసిన బీజేపీ నేత

March 27, 2018

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. మే 12వ తేదీన  పోలింగ్ జరగుతుందని సీఈసీ ఓం ప్రకాశ్ రావత్ ప్రకటించారు. రాష్ట్రంలోని మొత్తం 224 నియోజకవర్గాలకు ఈసీ ఒకే విడతలో ఎన్నికలను నిర్వహించనుందని పేర్కొన్నారు. ఎన్నికల్లో ఈవీఎంలతో పాటు వీవీపాట్ మెషీన్లను కూడా వాడతామన్నారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ఫోటోలను కూడా ఈవీఎంలకు జత చేస్తామని, దాంతో ఓటర్లు గందరగోళపడరని తెలిపారు.

మహిళలకు ప్రత్యేక కేంద్రాలు.

మహిళ కోసం ప్రత్యేకంగా 450 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయనున్నారు. ఈ రోజు నుంచి ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తుంది. ఇది రాష్ట్రానికే కాకుండా, కేంద్ర ప్రభుత్వానికి కూడా వర్తిస్తుంది.  అభ్యర్థులు రూ. 28లక్షలు మాత్రమే ఖర్చు చేయాలని ఈసీ నిబంధన విధించింది. గత ఎన్నికల్లో మొత్తం 4.96 కోట్ల మంది ఓటు హక్కును వినియోగించారని ఈసీ.

ఎన్నికల షెడ్యూల్ వివరాలు:

 

నోటిఫికేషన్ విడుదల: ఏప్రిల్ 17

నామినేషన్లకు తుది గడువు: ఏప్రిల్ 24

నామినేషన్ల పరిశీలన: ఏప్రిల్ 25

నామినేషన్ల ఉపసంహరణకు తుది గడువు: ఏప్రిల్ 27

ఎన్నికల తేదీ: మే 12

ఓట్ల లెక్కింపు తేదీ: మే 15

కాగా, ఈ షెడ్యూలు వివరాలను ఈసీ ప్రకటించకముందే బీజేపీ నేత ఒకరు ప్రకటించడం వివాదానికి దారి తీసింది. బీజేపీ ఐటీ సెల్ నేత అమిత్  మాలవీయ తన ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఈసీ నుంచి ఈ డేట్స్ ఎలా లీకయ్యాయని విపక్షాలు ప్రశిస్తున్నాయి. కర్ణాటక ఎన్నికల్లో అధికార కాంగ్రెస్సే మళ్లీ అధికారంలోకి వస్తుందని సర్వేలు చెబుతున్న నేపథ్యంలో ఫలితాలను మార్చడానికి బీజేపీ ఈసీని తన చెప్పుచేతల్లోకి తీసుకుందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.