పెళ్లికి రావాలంటూ ఓటరు కార్డులు పంచుతున్నాడు! - MicTv.in - Telugu News
mictv telugu

పెళ్లికి రావాలంటూ ఓటరు కార్డులు పంచుతున్నాడు!

April 19, 2018

ప్రచారం వెరైటీగా ఉంటేనే రాణిస్తుంది. పాత నినాదాలు, ప్రసంగాలు ఆకట్టుకోవు. ఏదైనా సరే కొత్తగా ఉంటే జనం ఆదరిస్తారు. కర్ణాటకలో త్వరలో అసెంబ్లీ ఎన్నికల జరగనున్న నేపథ్యంలో ఓటు హక్కు వినియోగం పై అవగాహన కల్పించేందుకు ఓ వరుడు వినూత్న ప్రయత్నం చేశాడు. హంగల్ పట్టణానికి చెందిన సిద్దప్ప ఏప్రిల్ 27న పెళ్లి చేసుకోబోతున్నాడు. దీంతో తన పెళ్లి కార్డును  ఎన్నికల కార్డు రూపంలో ముద్రించాడు. దానిపై తన ఫొటోను, వధువు ఫోటోను అచ్చేశాడు. శుభలేఖలో ఎన్నికల సంఘం చిహ్నం బదులు జాతీయ చిహ్నాన్ని ముద్రించారు.

ఎన్నికల ప్రధాన్యతను చెప్పి, పెళ్లికి వచ్చే అతిథులందరితో ఓటే వేయించాలన్న ఉద్దేశంతో తాను వివాహ ఆహ్వాన పత్రికను ఓటరు ఐడీ రూపంలో ముద్రించుకున్నానని సిద్దప్ప తెలిపాడు. మే 12న కర్ణాటక ఎన్నికలు జరగనున్నాయి. తన పెళ్లి జరిగిన కొద్దిరోజులకే ఎన్నికలు రానుండటంతో అతిథుల్లో కొందరికైనా అవగాహన కలుగుతుందని సిద్ధప్ప ఆశిస్తున్నాడు.