లోకాయుక్తకు కత్తిపోట్లు.. కాంట్రాక్టర్ ఘాతుకం. - MicTv.in - Telugu News
mictv telugu

లోకాయుక్తకు కత్తిపోట్లు.. కాంట్రాక్టర్ ఘాతుకం.

March 7, 2018

అందరికీ న్యాయం చెప్పే న్యాయమూర్తిపై హత్యాయత్నం జరిగింది. ఈ ఘటన కర్ణాటకలో జరిగింది. ఆ రాష్ట్రంలోని లోకాయుక్త జస్టిస్ విశ్వనాథ్ శెట్టిని ఈ రోజు ఓ దుండగుడు అతని ఆఫీసులోనే కత్తితో మూడుసార్లు కత్తితో పొడిచాడు. దగ్గర్లోనే ఉన్న పోలీసులు వెంటనే అతణ్ని అదుపులోకి తీసుకుని, జడ్జిని మాల్యా ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలలకడగా ఉంది. ఈ విషయాన్ని ఆ రాష్ట్ర హోంశాఖ మంత్రి రామలింగా రెడ్డి మీడియాకు తెలిపారు.

నిందితున్ని తేజ‌స్ శ‌ర్మ‌గా పోలీసులు  గుర్తించారు. తాను న్యాయవాదినని, లోకాయుక్త‌కు ఫిర్యాదు ఇచ్చేందు వచ్చానని చెప్పి శర్మ ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. కర్ణాటక లోకాయుక్త ఆఫీసులో పెద్ద‌గా సెక్యూరిటీ లేదు. శర్మ దీన్ని అదునుగా తీసుకున్నాడు. శర్మ తముకూరులో కాంట్రాక్టర్ గా పనిచేస్తున్నాడని, టెండర్ల విషయంలో ఫిర్యాదు చేయడానికి వచ్చాడని తెలిపారు.