30  కోతుల హత్య.. - MicTv.in - Telugu News
mictv telugu

30  కోతుల హత్య..

December 15, 2017

కర్ణాటకలోని  కట్టి శ్రీనివాసపురం తాలుకాలోని యర్రకొండలో దారుణం జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు  దాదాపుగా 30 కోతులను చంపేసి వాటిని సంచుల్లో నింపి  కొండపై పడేసి పోయారు.   ఉదయం స్థానికులు కొండపైకి  వెళ్లిగా ఈ దారుణం వెలుగులోకి వచ్చింది.వెంటనే గ్రామస్థులు పోలీసులకు, అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు.  సంఘటన స్థలానికి వచ్చిన అటవీ అధికారులు, పోలీసులు విచారణ చేపట్టారు. కోతులను ఎవరు,ఎందుకు , ఎలా చంపారనే కోణంలో దర్యాఫ్తు చేస్తున్నారు. కోతుల మృతదేహలకు స్థానికులు సాముహికంగా అంత్యక్రియలు నిర్వహించారు.  కోతులను చంపిన వారిని కఠినంగా శిక్షలు విధించాలని డిమాండ్ చేస్తున్నారు.