గంజాయి కేసు… నిత్యానంద కోసం గాలింపు…

గంజాయి తీసుకుంటే తప్పేం లేదు.. అని ప్రేరేపించేలా వ్యాఖ్యలు చేసిన వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు నిత్యానంద చిక్కుల్లో పడ్డారు. అలాంటి వ్యాఖ్యలు చేసి జనాలకు ఏం సందేశం ఇస్తున్నారనే కోణంలో ఆయన కోసం కర్ణాటక పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. నిత్యానంద చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయి, తెగ దూమారం రేపాయి. దీంతో సీసీబీ పోలీసులు నిత్యానందకు ఇటీవల నోటీసులు కూడా జారీ చేశారు. నోటీసులపై ఆయన స్పందించపోవడంతో పోలీసులు ఆయనను అరెస్ట్ చెయ్యటానికి రంగంలోకి దిగారు. పోలీసులు తనను అరెస్ట్‌ చేస్తారనే భయంతోనే నిత్యానంద బిడిది వీడి తమిళనాడులో తలదాచుకున్నట్లు తెలుస్తోంది. ఒక ప్రత్యేక బృందం నిత్యానంద కోసం అక్కడికి వెళ్ళారు.Telugu news Karnataka Police hunt for Nithyananda swami