భార్యకు గుడి కట్టి 12 ఏళ్లుగా పూజలు !   - MicTv.in - Telugu News
mictv telugu

భార్యకు గుడి కట్టి 12 ఏళ్లుగా పూజలు !  

February 23, 2018

ఓ రైతు తన భార్యపై అమితమైన ప్రేమతో ఆమెకు గుడి కట్టాడు. ఆ గుడిలో దేవతల విగ్రహాలతో సహా తన భార్య విగ్రహాం పెట్టి పూజలు నిర్వహిస్తున్నాడు.

 

కర్ణాటకలోని చామర్ రాజ్‌నగర్ జిల్లాలోని ఎల్లందూర్ కృష్ణపుర గ్రామానికి  చెందిన రాజు అనే రైతు 2004లో తన సోదరి కుతూరైన రాజమ్మను పెద్దలు వద్దని వాదించిన కూడా ప్రేమ వివాహం చేసుకున్నాడు. ఆమె తమ గ్రామంలో గుడి నిర్మించాలని భర్తను  పదే పదే కోరేది. ఆమె కోరిక మేరకు రైతు  గుడిని నిర్మించుతున్న సమయంలోనే ఆమె ఆకస్మాత్తుగా  మరణించింది. రాజు 2006లో గుడిని పూర్తి చేశాడు. అంతేకాకుండా  దేవతల విగ్రహాలతో సహా తన భార్య రాజమ్మ విగ్రహాన్ని ప్రతిష్టించి 12ఏళ్ల నుంచి ప్రతి రోజు పూజలు నిర్వహిస్తున్నాడు.