బస్సు డ్రైవర్లలో ఇక సగం మంది ఆడవాళ్లే  - MicTv.in - Telugu News
mictv telugu

బస్సు డ్రైవర్లలో ఇక సగం మంది ఆడవాళ్లే 

November 1, 2017

కర్ణాటక ప్రభుత్వం డ్రైవర్ కొలువుల్లో మహిళలకు పెద్ద పీట వేస్తూ ప్రత్యేక విధానాన్ని తీసుకురానుంది. కర్ణాటక రాష్ట్ర రహదారి రవాణా కార్పొరేషన్, బెంగళూరు మెట్రోపాలిటన్ రవాణా కార్పొరేషన్‌లో 50 శాతం ఆర్టీసీ బస్సు డ్రైవర్ల పోస్టులను మహిళకే కేటాయించనుంది. రవాణా మంత్రి హెచ్ఎం రెవన్నా ఇటీవల కేఎస్ ఆర్టీసీ , బీఎంటీసీ  అధికారులతో నిర్వహించిన సమావేశంలో అధికారులకు ఆదేశాలను జారీ చేశారు.

దీని కోసం ఓ ముసాయిదా విధానాన్ని రూపొందించాలని మంత్రి అధికారులను ఆదేశించారు.ఈ పాలసీ ద్వారా మహిళలకు ఆర్టీసీ బస్సు డ్రైవర్లుగా తీసుకునే మహిళలకు శిక్షణ,ప్రత్యేక వేతనం ఇవ్వనున్నారు. రిజర్వేషన్ విధానాన్ని వర్తింపజేసి మహిళలకు 50 శాతం  ఉద్యోగాలను కేటాయిస్తామని తెలిపారు.వారికి ఉచితంగా డ్రైవింగ్ శిక్షణ ఇవ్వడమే కాకుండా ఉచితంగా డ్రైవింగ్ లైసెన్స్ కూడా ఇవ్వనున్నట్టు మంత్రి తెలిపారు. ప్రభుత్వం రవాణా ఆర్టీసీలో 50 శాతం రిజర్వేషన్ కల్పించిన తొలిరాష్ట్రంగా కర్ణాటక నిలివందని రెవన్నా తెలిపారు.