82 ఏళ్ల తాతకు వారసుడు పుట్టాడు - MicTv.in - Telugu News
mictv telugu

82 ఏళ్ల తాతకు వారసుడు పుట్టాడు

November 2, 2017

కర్ణాటకలోని గుల్బర్గా జిల్లాలో ఉన్న ప్రఖ్యాత శరణ బసవేశ్వర సంస్థాన పీఠాధిపతి శరణ బసప్ప.. తాత,ముత్తాత వయస్సులో తండ్రి అయ్యాడు. పీఠానికి, ఆస్తులకు వారసుడు లేడని తెగ  బాధపడుతున్న 82 ఏళ్ల బసప్ప వెత ఎట్టకేలకు తీరింది. ఆయన రెండో భార్య( 42) ముంబైలోని ఆసుపత్రిలో పండంటి మగబిడ్డకు జన్మించింది. మగబిడ్డ పట్టాడు అని తెలియగానే తాత సంతోషంతో నృత్యం చేశాడట. మెుదటి భార్యకు వరుసగా ఐదుగురు కుతూళ్లు జన్మించడంతో ఆయన రెండో పెళ్లి చేసుకున్నారు. రెండో భార్య కూడా ముగ్గురు ఆడపిల్లలకు జన్మించింది. ఇప్పుడు మగపిల్లాడికి జన్మించింది. శరణ బసవప్పకు దాదాపుగా రూ.100 కోట్ల ఆస్తులు ఉన్నాయి. ఆయన మఠం అనేక విద్యాసంస్థలు నడుపుతోంది.