ఆధార్ కు దేవుడితో లింకు..  - MicTv.in - Telugu News
mictv telugu

ఆధార్ కు దేవుడితో లింకు.. 

September 1, 2017

మనిషి జీవితం పూర్తిగా ఆధార్ తో ముడిపడిపోయింది. పన్నులు కట్టాలన్నా , జీతం  తీసుకోవాలన్నా, ఆధార్ కావాలి. సెల్ ఫోన్ లో వేసుకునే సిమ్ కొనాలన్నా ఆధార్ తప్పనిసరి. ఇప్పడు దేవుడిని దర్శించాలంటే కూడా ఆధార్ ఉండాలట. రాను రాను గాలి పిల్చాలన్నా, నీళ్లు తాగలన్నా, బువ్వ తినలన్నా కూడా ఆధార్ ఆధారం అయ్యేలా ఉంది.

ఉత్తరాఖండ్ లోని పుణ్య క్షేత్రాలైన బద్రినాథ్, కేదర్ నాథ్, గంగోత్రి, యమునోత్రీలకు వేళ్లే భక్తులకు ఆధార్ రె తప్పనిసరిగా అనుసందానం చేయాలని కర్ణాటక  ప్రభుత్వం  ఆదేశాలను జారీ చేసింది. యాత్రికులకు ఇచ్చే 20 వేల సబ్సిడీ దుర్వినియోగమవుతుందనే భయంతో కర్ణాటక ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఆగస్టు 17న చయార్ ధామ్ తీర్థయాత్రకు నిబంధనల ప్రకారం.. సబ్సిడీ పోందే దరఖాస్తుదారుల నుంచి  ఆధార్ కార్డును ప్రూప్ గా తీసుకోవాలని ప్రభుత్వం పేర్కొంది.

“కర్ణాటక  సర్కారు 1000-1500 మంది ప్రజలకు ఛార్ ధామ్ యాత్ర కోసం ప్రతి సంవత్సరం  సబ్సిడీ ఇస్తుంది. కానీ ఈ సంవత్సరం యాత్రికుల సంఖ్య పెరగనుంది. దాంతో ప్రభుత్వం అందించే సబ్సిడిని ట్రావెల్ ఆపరేటర్లు యాత్రికులకు తప్పుడు సమాచారం ఇంచి. తప్పుడు పత్రాలను సమర్ఫించి ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేయకుండా  ఉండడానికి  యాత్రకు ఆధార్ తప్పనిసరి అని ప్రభుత్వం  నిర్ణయించిందని ‘ఓ సీనియర్ అధికారి తెలిపారు. 2014  లో కర్ణాటక సీఎం సిద్ధరామయ్య  పేద, మధ్యతరగతి ప్రజలకు  కోసం ఈ యాత్రను ప్రారంభించారు.