భార్యను చంపించేందుకు రూ.15లక్షల సుపారీ    - MicTv.in - Telugu News
mictv telugu

భార్యను చంపించేందుకు రూ.15లక్షల సుపారీ   

December 1, 2017

కట్టుకున్న భార్యకు కష్టా సుఖాల్లో తోడు ఉండాల్సిన  భర్త. ఆమెపై పగబట్టి  జైలు పాలయ్యాడు. కుటుంబ కలహాలతో భార్యను హత్య చేసేందుకు  సుపారీ ఇచ్చాడు. మధ్యలో పోలీసులు రంగప్రవేశం చేయడంతో భర్తతోపాటుగా సుపారీ ముఠాను అరెస్టు చేశారు.బెంగుళూరు వయ్యాలికావల్‌కు చెందిన వ్యాపారి నరేంద్రబాబు, వినుత దంపతులు. వీరికి పెళ్లి అయి ఏడేళ్లు అవుతుండగా, ఐదేళ్ల నుంచి గొడవలు జరుగుతున్నాయి. నరేంద్ర బాబు ఆస్తిలో తనకు భాగం కావాలని వినుత భర్తపై ఒత్తిడి తెచ్చింది. ఈక్రమంలో ఆమె ఇటీవల వయ్యాలికావల్ పోలీసు స్టేషన్‌లో  భర్త, అత్తమామలపై పిర్యాదు చేసింది. భార్యను  చంపించాలనుకున్న నరేంద్రబాబు ఒక ముఠాతో  రూ.15లక్షల డీల్ కుదుర్చుకున్నాడు. రూ. 2లక్షలు అడ్వాన్స్ చెల్లించాడు. బుధవారం ఈ ముఠా సభ్యులు వినుతను చంపాలని ప్రయత్నించారు.  గురువారం రోజున వయ్యాలికావల్ ప్రాంతంలో ఓ ఆటోలో కూర్చొని వినుత కోసం  కాపు కాస్తున్నారు. ఆ సమయంలో అటుగా వచ్చిన  పోలీసులు వారి వైఖరిపై అనుమానం వచ్చి ప్రశ్నించగా అసలు విషయం బయటికి వచ్చింది.  దాంతో పోలీసులు  ముఠా సభ్యులు చిన్నస్వామి,అభిలాశ్ లతోపాటుగా నరేంద్రబాబును అరెస్టు చేశారు. గతంలో కూడా తనపై భర్త, అత్తమామలు కిరోసన్ పోసి తగలబెట్టేందుకు ప్రయత్నించారని వినుత  పోలీసులకు చెప్పింది.