పార్టీ పెట్టిన ఉపేంద్ర   - MicTv.in - Telugu News
mictv telugu

పార్టీ పెట్టిన ఉపేంద్ర  

October 31, 2017

కన్నడ కథానాయకుడు ఉపేంద్ర  రాజకీయ పార్టీని స్థాపించారు. ఆయన మంగళవారం కర్ణాటక ‘ప్రాజ్ఞావంత జనతా పక్ష’ ( కేపీజేపీ) పేరుతో పార్టీని ప్రకటించి,  బెంగళూరు‌లోని గాంధీ భవన్‌లో తన పార్టీని ఆవిష్కరించాడు. పార్టీని స్థాపించిన ఉపేంద్ర, ‘ఇది కేవలం పార్టీనే కాదని,ప్రజల కోసం ప్రజల పార్టీ అని చెప్పారు. ‘నేను కేవలం మీ కోసం ఓ వేదికను  సృష్టించాను.  పార్టీలో చేరాలని ఆసక్తి ఉన్నవారు చేరవచ్చు, మార్పు తీసుకురావడమే నా లక్ష్యమని’  తెలిపారు.

‘తమ పార్టీ.. వ్యక్తిత్వాలపై దృష్టిపెట్టదని, మంచి సమాజాన్ని ఏర్పాటు చేయడానికి కృషి చేయనున్నట్టు’ ఉపేంద్ర చెప్పాడు.  ‘ప్రజలకు ఎక్కువగా అవసరమయ్యే వాటిపైనే తమ పార్టీ దృష్టిసారించనుందని’ తెలిపాడు. ‘అందరికీ ఆరోగ్యం , విద్య, మౌలిక అవసరాలు, చిన్న గ్రామాలు , వ్యవసాయభివృద్ది, చిన్న పరిశ్రమలను ప్రోత్సహించి అభివృద్ది చేయడం, స్థానిక ప్రతిభను ప్రోత్సహించడం తమ పార్టీ జాబితాలోని అంశాలని’  తెలిపారు. నవంబర్ 10న వెబ్‌సైట్‌ యాప్‌ను ప్రారంభించనున్నట్టు తెలిపారు.

సమాజం, రాష్ట్రం  అభివృద్ది సాధించాలని తెలుపుతూ తమ ఆలోచనలతో ప్రజలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. 2018 లో అన్ని అసెంబ్లీ స్థానాల నుంచి కేపీజేపీ పోటీ చేస్తుందని , ఎన్నికలకు కేవలం ఆరు నెలలు సమయం ఉందన్నారు. ‘మనం గెలువకపోవచ్చు కానీ  మార్పు తీసుకురావడం ప్రధాన ధ్యేయమని’  పేర్కొన్నారు.  త్వరలోనే పార్టీలోని సభ్యులను కూడా ప్రకటించనునట్టు ఉపేంద్ర తెలిపాడు.