అల్లరి చేశారని జట్టు కోసిన టీచర్లు - MicTv.in - Telugu News
mictv telugu

అల్లరి చేశారని జట్టు కోసిన టీచర్లు

February 13, 2018

పిల్లలు అల్లరి చేస్తారు. సముదాయించడం పెద్దల పని. కానీ పెద్దల్లో రోజురోజుకూ అసహనం పెరిగిపోతోంది. విద్యార్థులు అల్లరి చేస్తున్నరంటూ వారి జుట్టును ఉపాధ్యాయులు కత్తిరించారు. ఈ సంఘటన కర్ణాటకలోని బెళగావిలో జరిగింది. తాలూకాలోని కాకతి గ్రామంలో సెయింట్ జాన్స్  స్కూల్లోని పిల్లలు అల్లరి చేస్తున్నారని,  బుద్ధిగా ఉండడం లేదంటూ  20 మంది పిల్లల జుట్టు కత్తిరించించారు టీచర్లు..ఈ విషయం పిల్లల ద్వారా తెలుసుకున్న తల్లిదండ్రులు పాఠశాలకు చేరుకుని యాజమాన్యాన్ని నిలదీశారు. అయితే  పాఠశాల ప్రధానోపాద్యాయుడు  వారినే బెదించాడు. అంతేకాకుండా దీనిపై పాఠశాల  సిబ్బందిని ప్రశ్నించడానికి వెళ్లిన స్థానిక మీడియాను కూడా పాఠశాల యాజమాన్యం బెదిరించారు.