యడ్యూరప్ప అవినీతిపరుడు.. అమిత్ షానే చెప్పారు! - MicTv.in - Telugu News
mictv telugu

యడ్యూరప్ప అవినీతిపరుడు.. అమిత్ షానే చెప్పారు!

March 27, 2018

ఈ మధ్యే ఓ రిటైర్డ్ సుప్రీం కోర్టు జడ్జి దేశంలో అవినీతి గురించి మాట్లాడారు. తాను చూసిన, గమనించిన ప్రభుత్వాల్లో యాడ్యూరప్ప ప్రభుత్వమే అత్యంత అవినీతిమయమైందని అన్నారు… అలా ఉంది కర్ణాటక పరిస్థితి..’.. ఈ మాటలు అన్నది ఏ కాంగ్రెస్ నాయకుడో, వామపక్షీయులో కాదు. కర్ణాటక మాజీ సీఎం యడ్యూరప్పకు చెందిన బీజేపీ అధినేత అమిత్ షా అందరి ముందూ అన్నవి.

 

సొంత పార్టీ నేతను అత్యంత అవినీతిపరుడని అమిత్ షా చేసిన ఈ వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. అమిత్ మంగళవారం మీడియాతో మాట్లాడుతూ… కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య.. తమ పార్టీపై చేసిన ఆరోపణలకు సమాధానాలు ఇచ్చారు. ఈ సందర్భంగా సుప్రీం కోర్డు రిటైర్డ్ జడ్జీ ప్రస్తావన తెచ్చి యడ్డిని అవినీతిపరుడన్నారు. పక్కనే ఉన్న యడ్డి ఉలిక్కి పడ్డారు. దీంతో అమిత్ వెంటనే సర్దుకుని ‘నేనంటున్నంది యడ్డూరప్ప గురించి కాదు సిద్దరామయ్య గురించి’ అని వివరించారు. అయితే అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. సదరు వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరలైంది. సిద్ధరామయ్య కూడా దాన్ని ట్విట్టర్‌ ఖాతాలో పోస్ట్‌ చేశారు.

అమిత్ షా నిజాలే మాట్లాడరని, అందులో సిగ్గుపడాల్సిన అవసరం లేదని నెటిజన్లు అంటున్నారు. యడ్డి అవినీతి కేసుల్లో జైలుకెళ్లడం తెలిసిందే.