96 ఏళ్ల  బామ్మకు ల్యాప్‌టాప్.. నేర్చుకుని ఉద్యోగం చేస్తా..

ముదిమి మీద పడినా ‘సడలని పట్టుదలతో చదువుకుంటున్న కార్తియమ్మ బామ్మ కల నెరవేరింది. కంప్యూటర్ నేర్చుకుంటానన్న ఆమె కోరికను  కేరళ ప్రభుత్వం దీపావళి పండగ సందర్భంగా తీర్చేసింది. 96 ఏళ్ల కార్తియమ్మ వయోజన విద్యాపథకం కింద చదువును నేర్చుకుని అక్షరలక్ష్యం పరీక్షల్లో 100కు 98 మార్కులతో రాష్ట్రంలో మొదటి ర్యాంకు సాధించడం తెలిసిందే. తనకు కంప్యూటర్ కూడా నేర్చుకోవాల్సి ఉందని ఆమె చెప్పింది.

rr

కార్తియమ్మ కోరికను తెలుసుకున్నవిద్యా శాఖ మంత్రి సి.రవీంద్ర నాథ్‌ స్వయంగా అలప్పులలోని ఆమె ఇంటికెళ్ి  ల్యాప్టాప్ను బహుమతిగా ఇచ్చారు. దాని ఖరీదు 25,000. ల్యాప్ టాప్‌ను బామ్మకు ఇచ్చి ఓపెన్ చేశాక.. ామమె తన పేరును ఇంగ్లిష్‌లో టపటపా చేసేసింది. దీంతో మంత్రితోపాటు ఆమె పిల్లాజెల్లా కూడా నోరెళ్లబెట్టారు. కంప్యూటర్ అంటే ఓస్ ఇంతేనా అని బామ్మ కూడా బోసిగా నవ్వేసింది. ఖాళీ సమయాల్లో ల్యాప్టాప్ నేర్చుకుంటానని,  పదో తరగతి కూడా పాస్ అవుతానని ధీమాగా చెప్పింది. ల్యాప్ టాప్ నేర్చుకుని ఉద్యోగం చేయాలని ఉందని, తమ కుటుంబం పేద కుటుంబమని వివరించింది.  

Telugu news Karthyayani Amma, 96-Year-Old Who Topped Kerala Literacy Exam, Gets Laptop as Gift From Education Minister