కరుణానిధి బౌలింగ్.. అదో ఆనందం! - MicTv.in - Telugu News
mictv telugu

కరుణానిధి బౌలింగ్.. అదో ఆనందం!

March 1, 2018

‘నేను ముసలోణ్ణి అని కూసిందెవరు.. వయసు పెరిగినా చేవ చావని, మడమ తిప్పని నాయకుణ్ణి నేను.. ఖబడ్దార్ ఎవరైనా నాకు వృద్ధాప్యం అని, చేతనవటం లేదనే పుకార్లు సృష్ఠిస్తే ఊరుకోను..  కారు కూతగాళ్ళకు నా వీడియోలతో షేక్ చేస్తా ఏమనుకుంటున్నారో.. ’ అన్నట్టుగానే వుంది డీఎంకే అధినేత కరుణానిధిని ఈ వీడియోలో చూస్తుంటే. ఆయన వీడియోలో మనవడితో క్రికెట్ ఆడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

వీల్ చేర్‌లో కూర్చున్న కరుణానిధి బంతి విసిరితే మనవడు బ్యాటుతో కొడుతున్నాడు. ఇద్దరు మహిళలు బంతిని తెచ్చి కరుణానిధి చేతికి అందిస్తున్నారు. కరుణానిధి చాలా చలాకీగా మనవడితో క్రికెట్ ఆడారు. ఈ వీడియోను ఆయన బంధువులే తీసి సోషల్ మీడియాలో పెట్టారు. ఆయన ఆరోగ్యం మీద వస్తున్న పుకార్లకు సమాధానంగా ఈ వీడియోను అప్‌లోడ్ చేసారని అంటున్నారు నెటిజనులు. ఆయన చలాకీతనం చూసి చాలామంది కామెంట్ల రూపంలో తమ సంతోషం వ్యక్తం చేశారు.