కశ్మీర్‌కు స్వాతంత్య్రం వచ్చేసింది.. ఓ ప్రశ్నపై రచ్చరచ్చ.. - MicTv.in - Telugu News
mictv telugu

కశ్మీర్‌కు స్వాతంత్య్రం వచ్చేసింది.. ఓ ప్రశ్నపై రచ్చరచ్చ..

February 26, 2018

జమ్ము కశ్మీర్ లో పట్వారీ ఉద్యోగానికి  నిర్వహించిన  పరీక్షలో అడిగిన ఓ ప్రశ్న ఇప్పుడు అంతటా వివాదంగా మారింది. ఆ ప్రశ్నలో కశ్మీర్‌కు నిర్వాహకులు స్వాతంత్య్రం ఇచ్చేశారు.  కశ్మీర్‌ను  అజాద్ కశ్మీర్ అని  ముద్రించారు నిర్వాహకులు.  ఆ ప్రశ్న కొన్ని రోజులుగా  సోషయల్ మీడియాలో వైరల్ అయ్యింది.  దీనితో సెలక్షన్ బోర్డ్ చైర్మన్ విచారణకు ఆదేశించారు.

 

పాక్ ఆక్రమిత కశ్మీర్‌ (పీఓకే)ను ‘స్వతంత్ర కశ్మీర్’ అంటూ  ఈ  ప్రశ్నలో  చెప్పడం వెనుక కారణం ఏంటి  అని నిలదీస్తూ  పలువురు మండిపడుతున్నారు. పాకిస్థాన్ కశ్మీర్‌లోని కొంత భాగాన్ని అక్రమంగా స్వాధీనం చేసుకున్న ప్రాంతమే పీఓకే. దీన్ని స్వతంత్ర కశ్మీర్ పేరుతో పాకిస్థాన్ పిలుస్తోంది. కానీ  కశ్మీర్ పరీక్ష నిర్వాహకులు  వారికి మద్దతుగా ఆ ప్రశ్నను తయారు చేశారా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కశ్మీర్ లోయలోని కొన్ని ప్రాంతాలలో తన ఉనికిని చాటేందుకే స్వతంత్య్ర కశ్మీర్ గా  పాకిస్థాన్ ప్రచారం చేస్తోంది.

ఇంతకీ ఆ పరీక్షలో అడిగిన ప్రశ్న ఏంటంటే…

ఉత్తర, తూర్పు దిశలో చైనాతో అంతర్జాతీయ సరిహద్దు కలిగిన జమ్మూ కశ్మీర్‌ను పాక్ అధీనంలో ఉన్న అజాద్ కశ్మీర్, గిల్గిత్-బాల్టిస్థాన్ నుంచి నియంత్రణ రేఖ వద్ద వేరు చేసే ప్రాంతం ఏంటి? అని పరీక్షలో అడిగారు.