అదిలాబాద్.. తెలంగాణ కశ్మీర్.. కేసీఆర్ - MicTv.in - Telugu News
mictv telugu

అదిలాబాద్.. తెలంగాణ కశ్మీర్.. కేసీఆర్

February 27, 2018

ఎల్లప్పుడూ పచ్చని అడవులతో అలరారే  ఆదిలాబాద్ జిల్లా తెలంగాణ రాష్ట్రానికి  కాశ్మీర్ లాంటిదని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు.  ఆదిలాబాద్ నియోజకవర్గ ప్రజాప్రతినిధుల సమావేశంలో పాల్గొని ముఖ్యమంత్రి ప్రసంగించారు. ఈ సందర్భంగా అత్యంత వెనుకబడ్డ జిల్లాగా ముద్రపడ్డ ఆదిలాబాద్ మీద వరాల ఝల్లు కురిపించారు. ఆదిలాబాద్‌కు అదనంగా వెయ్యి డబుల్ బెడ్‌రూం ఇండ్లు ప్రకటించారు. అగ్రికల్చర్, మరాఠీ కళాశాలలు మంజూరు చేస్తున్నట్టు తెలిపారు. ఆదిలాబాద్ పట్టణ అభివృద్ధికి రూ. 85 కోట్లు వెచ్చిస్తున్నట్టు ప్రకటించారు. మంత్రి జోగు రామన్న కోరిక మేరకు ఆదిలాబాద్‌లో మినీ ఏరోడ్రామ్ ఏర్పాటు చేస్తామన్నారు.సాత్నాల ప్రాజెక్టులను గత ప్రభుత్వాలు పట్టించుకోలేదని, ఈ ప్రాజెక్టు ద్వారా 24వేల ఎకరాలకు సాగునీరు ఇస్తామన్నారు. ఆదిలాబాద్‌ ఇంకా అభివృద్ధి సాధించాల్సిన అవసరం ఉందని కేసీఆర్ వ్యాఖ్యానించారు. గిరిజనుల అభివృద్ధి కోసం రూ. 78 కోట్లు మంజూరు చేస్తున్నామని చెప్పారు. ముస్లిం సోదరుల కోసం 17 కోట్లు విడుదల చేస్తాం.. దళిత సోదరుల అభివృద్ధికి రూ. 7 కోట్లు మంజూరు చేస్తున్నామని ప్రకటించారు. ఆదిలాబాద్ నియోజక వర్గంలోని గ్రామ పంచాయతీలకు రూ. 75 కోట్లు కేటాయిస్తామని సీఎం వెల్లడించారు.