పవన్‌పై విరామం ప్రకటిస్తున్నా...పీకే ఫ్యాన్స్  ఇక నన్ను గెలకద్దు - MicTv.in - Telugu News
mictv telugu

పవన్‌పై విరామం ప్రకటిస్తున్నా…పీకే ఫ్యాన్స్  ఇక నన్ను గెలకద్దు

December 10, 2017

కొంతకాలంగా కత్తి మహేష్‌ మరియు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ నడుమ మాటల యుద్దం నడుస్తున్న  సంగతి తెలిసిందే. అయితే తాజాగా కత్తి మహేష్  తన ఫేస్‌బుక్ పేజీలో ఓ పోస్ట్ పెట్టాడు. ‘పవన్ కళ్యాణ్ ని ఇబ్బడిమబ్బడిగానే ఎండగట్టాను. నా వాదాన్ని బిగ్గరగా, చాలా తేటగా వినిపించాను.

ఆయన్ని వేసుకునే నా జైత్రయాత్రకు ఇక్కడ చిన్న విరామం ఇవ్వాలనుకుంటున్నాను… విరామమే… నన్ను మళ్ళీ వాళ్ళు రెచ్చగొట్టే వరకు మాత్రమే సుమా! నేను మళ్ళీ రావాలా వద్దా అనేది పవన్ కళ్యాణ్ అభిమానుల చేతుల్లోనే వుంది.

నేను అడిగిన అనేక ప్రశ్నలకు ఆయన దగ్గరనుండి జవాబు రాదని తెలుసు. కానీ నా ప్రశ్నలు అనేకమంది ఆయన అనుచరుల్ని పునరాలోచనలో పడేశాయి. నాకు కావాల్సింది కుడా అదే. నేనిప్పుడు వేరే మూడ్ లోకి వెళ్ళాలనుకుంటున్నా… కానీ ఒక హెచ్చరిక… నన్ను కెలికితే నా మూడ్ తప్పకుండా మారి వెనక్కి వచ్చే అవకాశాలు మెండుగా వున్నాయి. తస్మాత్ జాగ్రత్త!’ అని  పవన్ కళ్యాణ్  ఫ్యాన్స్‌ని కత్తి మహేశ్ .. పై విధంగా  హెచ్చరించాడు.