నేపాల్‌లో ఘోరం.. విమానం కూలి 50 మంది మృతి - MicTv.in - Telugu News
mictv telugu

నేపాల్‌లో ఘోరం.. విమానం కూలి 50 మంది మృతి

March 12, 2018

ఇంకాసేపట్లో విమానం ల్యాండ్ అవగానే దిగేసి ఎవరి గమ్యాలకు వాళ్ళు వెళ్ళిపోతామనుకున్నారు. కానీ వాళ్ళకేం తెలుసు ఇదే తమకు ఆఖరి ప్రయాణం అవుతుందని ? నేపాల్ రాజధాని కఠ్మాండులోని  త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకుంది. స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం 2:20 గంటలకు ఈ ప్రమాదం జరిగింది.ఎయిర్‌పోర్ట్‌లో ఓ ప్యాసెంజర్ విమానం ల్యాండ్ అవుతూనే ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. బంగ్లాదేశ్ ఎయిర్‌లైన్స్‌కి చెందిన ఈ విమానం ప్రమాదానికి గురైన సమయంలో మొత్తం 67 మంది ప్రయాణిస్తున్నారు. విమానం కూలిపోవడంతోనే మంటలు ఎగిసిపడ్డాయి. క్షణాల్లోనే విమానాశ్రయం పరిసరాల్లో దట్టమైన పొగలు అలుముకున్నాయి. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 50 మంది సజీవ దహనమైనట్టు గుర్తించారు. మంటలను అదుపులోకి తెచ్చేందుకు అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.  అధికారులు వెంటనే అప్రమత్తమయి సహాయక చర్యలు చేపట్టడంతో 17 మంది ప్రాణాలతో బయటపడగలిగారు. ప్రస్తుతం విమానాశ్రయంలో రాకపోకలను నిలిపివేసి ముమ్మరంగా సహాయక కార్యక్రమాలు చేపట్టారు.