కథువా ఘటనపై  కోర్టు విచారణ ప్రారంభం… - MicTv.in - Telugu News
mictv telugu

కథువా ఘటనపై  కోర్టు విచారణ ప్రారంభం…

April 16, 2018

జమ్మూ కాశ్మీర్‌లోని కథువా ప్రాంతంలో జనవరి 10న  8ఏళ్ల బాలిక ఆసిఫాపై కొందరు వ్యక్తులు దారుణంగా మత్తుమందు ఇచ్చి  అత్యాచారం చేసి చంపారు. ఆ ఘటనపై దేశ వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆ ఘటనపై విచారణ ప్రారంభం కానుంది.  జమ్ముకాశ్మీర్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఏడుగురు నిందితులపై మోపిన అభియోగాలను న్యాయమూర్తికి వివరించనున్నారు. ఎనిమిదో నిందితుడు అయిన బాలనేరస్థుడిపై విచారణను విడిగా చేయనున్నారు.బాధితురాలి కుటుంబం తరఫున వాదించనున్న న్యాయవాది దీపికా సింగ్‌ రజావత్‌కు పెద్ద ఎత్తున బెదింపులు వస్తుండడం తెలిసిందే. ఆదివారం కూడా కొందరు గుర్తు తెలియని వ్యక్తులు తనకు ఫోన్‌ చేశారని, ఈ కేసు వాదిస్తే  తనను రేప్‌ చేసి చంపేస్తామని బెదిరించారని ఆమె మీడియాతో చెప్పారు.