కథువా కేసును చేధించడం కష్టంగా ఉంది... డీఎస్పీ - MicTv.in - Telugu News
mictv telugu

కథువా కేసును చేధించడం కష్టంగా ఉంది… డీఎస్పీ

April 19, 2018

కథువా అత్యాచార కేసును దర్యాప్తు చేయడం చాలా కష్టంగా మారిందని డీఎస్పీ శ్వేతాంబరి శర్మ తెలిపింది. ఈ కేసులో ఆధారాలను సేకరించడం చాలా కష్టంగా ఉందని అంది.మైనర్ బాలిక అత్యాచార కేసులో ప్రత్యక్ష సాక్ష్యులు లేనందున దర్యాప్తు చేయడం చాలా కష్టంగా మారింది. నిందితులను విచారించినా  కూడా సాక్ష్యలను సేకరించడంలో తిప్పలు తప్పడం లేదు. ఈ ఘటన అత్యంత దురదృష్టకరమైందని అందరికీ తెలుసు. మనకు సాక్ష్యలు కావాలి. ప్రకటనలు చేసినంత సులువు కాదు, కేసు దర్యాప్తు చేయడమని తెలిపింది.బాధితుల తరపున వాదిస్తున్న లాయర్ దీపికా సింగ్‌ రజావత్‌ భద్రత గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆమె తెలిపారు.

ఈ కేసులో డిఫెన్స్‌ లాయర్‌ అంకుర్‌ శర్మ చేసిన ఆరోపణలపై ఆమె స్పందించింది… ‘ ఒక మహిళను ఇలా లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేయటం సరికాదు. అలాంటి వ్యాఖ్యలపై నేను స్పందించను. దేశ ప్రజలే బదులిస్తారు’ అంటూ శ్వేతాంబరి అంది.  8ఏళ్ల చిన్నారిపై జరిగిన ఈ అఘాయిత్యానికి తాను చలించిపోయానని తెలిపింది.ఆ తర్వాత కోలుకుని దర్యాప్తును వేగవంతం చేశానని ఆమె తెలిపింది. ‘మన న్యాయ వ్యవస్థ చాలా శక్తివంతమైంది. దానిపై అనుమానాలు అక్కర్లేదు’ అని ఆమె పేర్కొంది.