కట్టప్పకు అరుదైన గౌరవం ! - MicTv.in - Telugu News
mictv telugu

కట్టప్పకు అరుదైన గౌరవం !

March 12, 2018

‘బాహుబలి’ సినిమాలో కట్టప్ప పాత్రకు ఉన్న ప్రాముఖ్యత అందరికి తెలిసిందే. ఎస్.ఎస్ రాజమౌళి  దర్శకత్వంలో వచ్చిన బాహుబలి చిత్రంలో కట్టప్ప పాత్రలో నటించిన సత్యరాజ్ ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందాడు. ‘బాహుబలి’, ‘బాహుబలి ’2 చిత్రాలకే ప్రత్యేక ఆకర్షణగా  నిలిచిన ‘కట్టప్ప’ అరుదైన గౌరవాన్ని అందుకోనున్నాడు.లండన్‌లోని ప్రఖ్యాత ‘మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియం’లో కట్టప్ప మైనపు విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఇటువంటి అరుదైన గౌరవాన్ని దక్కించుకున్న మొదటి తమిళ నటుడిగా సత్యరాజ్ నిలువనున్నాడు. ఇప్పటికే మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో బాహుబలి స్టార్ ప్రభాస్ మైనపు విగ్రాహాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.