మళ్లీ బయటకొచ్చిన ‘కత్తి’.. మెగా ఫ్యామిలీపై దాడి..

శ్రీరాముడిపై అనుచిత వ్యాఖ్యలు చేసి రాష్ట్ర బహిష్కరణకు గురైన కత్తి మహేశ్ మళ్లీ వార్తల్లోకి ఎక్కాడు. జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను టార్గెట్ చేస్తూ తన ఫేస్‌బుక్  వేదికగా వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. ఇందులో దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం, ఏపీ సీఎం చంద్రబాబు, వైఎస్ జగన్‌ల ప్రస్తావన కూడా ఉంది. కత్తి పోస్టుపై కామెంట్స్ చేసిన నెటిజన్లకు కూడా వివరణ ఇచ్చాడు. అసలు కత్తి ఏమన్నాడో తెలుసా?

‘కాంగ్రెస్ వ్యతిరేకత.. రాజకీయ శూన్యత.. కమ్మ కుల అధికార దాహం.. ఎన్. టి. రామారావు చరిష్మా.. ఇవన్నీ కలిపి తెలుగుదేశం పార్టీ పెట్టిన ఎనిమిది నెలల కాలంలో అధికారంలోకి వచ్చింది.

పవన్ కల్యాణ్ తెలివి శూన్యత, కొణిదెల బ్రదర్స్/ ఫ్యామిలీపై అపనమ్మకం. కాపు కుల అనైక్యత. రాజకీయ సంవృద్ధి(బాబు. జగన్) కలగలిపి పవన్ రాజకీయాల్లోకి వచ్చి తొమ్మిది సంవత్సరాలు అయినా.. జనసేన 3 నుంచి 7 సీట్లకు మించి గెలవదు’ అంటూ కత్తి కామెంట్ చేశాడు.

‘పవన్ కల్యాణ్ ని నమ్ముకుంటే నష్టమే అని వామపక్షాలు గ్రహించాయి కాబోలు. ఈ కులసంఘం నాయకుడికి దూరంగా.. కాపుసేనకి దండంపెట్టి, జగన్ వైపు చెయ్యిచాస్తున్నారని రూఢిగా సమాచారం’ అంటూ మరో పోస్ట్‌లో కామెంట్ చేశారు. మరో వైపు కత్తి  చేసిన కామెంట్లపై పవన్ అభిమానులు, జనసేన కార్యకర్తలు మండిపడుతున్నారు.

Telugu News Katti Mahesh Sensational Comments On Jana sena Pawan Kalyan And Mega Family