రైతులను మోసం చేస్తున్న కేంద్రం.. - MicTv.in - Telugu News
mictv telugu

రైతులను మోసం చేస్తున్న కేంద్రం..

December 5, 2017

పంటల బీమాపై కేంద్రం వైఖరి సరిగా లేదన్నారు నిజామాబాద్ ఎంపి కల్వకుంట్ల కవిత. నిజామాబాద్ జిల్లా అభివృద్ధి సమన్వయ మరియు మానిటరింగ్ కమిటీ సమావేశం కలెక్టరేట్ ప్రగతి భవన్‌లో జరిగింది. కేంద్రం ఇస్తున్న నిధులతో అమలు చేస్తున్న అభివృద్ధి,సంక్షేమ కార్యక్రమాలను ఆమె సమీక్షించారు. అనంతరం కవిత మీడియాతో మాట్లాడుతూ ‘పంటల బీమాకు గ్రామాన్ని యూనిట్‌గా తీసుకోకుండా రైతును యూనిట్‌గా తీసుకుని నష్ట పరిహారం అందించాలని’ డిమాండ్ చేశారు.

గ్రామాన్ని యూనిట్‌గా తీసుకునే కేంద్రం విధానం వల్ల రైతులు నష్టపోతున్నారు’ అని ఆమె అన్నారు. ‘ఒక పక్క మహిళా సాధికారత అంటూనే కెజిబివి లను ఎత్తివేసిందని విమర్శించారు. NRGS నిధుల్లో కోత పెట్టారు, దాని ఫలితంగా కూలీలు నష్టపోయారు, కేంద్రం విడుదల చేయాల్సిన నిధులను కూడా విడుదల చేయడం లేదన్నారు’ కవిత.