mictv telugu

బిగ్‌బాస్ షోలో లైంగిక వేధింపులు

February 12, 2019

బిగ్‌బాస్ షో.. హిందీలో సూపర్ డూపర్ హిట్ అయి క్రమేపి అన్ని ప్రాంతీయ భాషలకు పాకిన సంగతి తెలిసిందే. అయితే కన్నడ బిగ్‌బాస్ షో పాల్గొని, మధ్యలోనే బయటకు వచ్చేసిన కంటెస్టెంట్ కవితా గౌడ, బిగ్‌బాస్‌లో తనతోపాటు పాల్గొన్న కంటెస్టెంట్ యాండీపై సంచలన విమర్శలు చేశారు. హౌస్‌లో యాండీ తనను లైంగికంగా వేధించాడంటూ ఆరోపిస్తూ, ఆమె మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. షోలో జరిగిన వేధింపుల గురించి కార్యక్రమ నిర్మాత గురుదాస్ శణైకి ముందే చెప్పానని, తనకు జరిగిన అన్యాయంపై బయటకు వచ్చిన తరువాతనే నోరు విప్పుతున్నానని పేర్కొంది.షోలో భాగంగా రెండు రోజుల పాటు ‘సూపర్‌ హీరో వర్సెస్‌ సూపర్‌ విలన్‌’ టాస్క్‌ జరిగిన సమయంలో యాండీ లైంగిక వేధింపులకు దిగాడని ఆరోపించింది. కాగా, కవితా గౌడ ఆరోపణలను యాండీ ఖండించాడు. బిగ్‌బాస్‌ పోటీల తరువాత ఆమెను తాను కలవలేదని అన్నాడు. ఒటమిని తట్టుకోలేక కవిత తనపై తప్పుడు ఆరోపణలు చేస్తోందని ఆరోపించాడు.