మీ బిడ్డెగ పుట్టడం నాఅదృష్టం నాన్న...హ్యాపీ బర్త్‌డే! - MicTv.in - Telugu News
mictv telugu

మీ బిడ్డెగ పుట్టడం నాఅదృష్టం నాన్న…హ్యాపీ బర్త్‌డే!

February 17, 2018

ఈరోజు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజు. 1954లో పుట్టిన కేసీఆర్ 64వ వసంతలోకి అడుగుపెట్టారు. తెలంగాణ మొత్తం ముఖ్యమంత్రి  పుట్టినరోజు వేడుకలను ఆయన అభిమానులు, టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు కేక్ కట్ చేసి జరుపుకున్నారు.

కేసీఆర్ బిడ్డె  నిజామాబాద్ ఎంపీ కవిత తన తండ్రికి శుభాకాంక్షలు తెలుపుతూ ట్విటర్లో  ఈవిధంగా రాశారు. ‘హ్యాపీ బర్త్‌డే డియర్ ఫాదర్..మిమ్మల్ని ఫాలో అవుతున్నందుకు నాకు గర్వంగా ఉంది. మీ కూతరుగా పుట్టడం నా అదృష్టం’ అని ట్వీట్ చేసింది. కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా పలుచోట్ల  సేవా కార్యక్రమాలు, రక్తదానాలు జరిగాయి.