కేసీఆర్ బర్త్‌డే హడావుడి అంతా ఇంతా కాదు! - MicTv.in - Telugu News
mictv telugu

కేసీఆర్ బర్త్‌డే హడావుడి అంతా ఇంతా కాదు!

February 16, 2018

తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు పుట్టినరోజు ఫిబ్రవరి17. కానీ ఆయన పుట్టినరోజు వేడుకల హంగామా వారం రోజుల నుంచే మొదలయ్యింది. ఇప్పటికే చాలామంది తమ అభిమాన నేత పుట్టినరోజును ఘనంగా నిర్వహించాలని అంతటా సన్నాహాలు చేస్తున్నారు.

హైదరాబాద్ నగరమంతా రేపు గులాబీ నేత ఫోటోలతో, ఫెక్సీలతో నింపేయాలని జీహెచ్ఎంసీ కసరత్తులు ప్రారంభించింది. రేపు నెక్లెస్‌రోడ్‌లోని జలవిహార్‌లో కేసీఆర్ పుట్టినరోజు వేడుకలను  ఘనంగా నిర్వహించనున్నట్టు మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ ప్రకటించారు. భారీ కేక్ కటింగ్‌తోపాటు, మెగా రక్తదానశిబిరం, వికలాంగులకు ట్రై సైకిళ్లు, అంధులకు చేతికర్రలు, వృద్ధ మహిళలకు చీరెల పంపిణీ వంటి సేవా కార్యక్రమాలు చేపట్టనున్నట్టు మంత్రి చెప్పారు.

వార్తా పత్రికలు అడ్వాన్స్ పుట్టినరోజు శుభాకాంక్షలు అంటూ పేజీలను నింపితే, ఇక టీవీ ఛానళ్లు స్పెషల్ గ్రీటింగ్స్ చెబుతూ అడ్వర్టైజ్‌మెంట్లను మొదలెట్టేశాయి. ఇలా ఓ వైపు పార్టీ శ్రేణులు మరోవైపు కేసీఆర్ అభిమానులు తమ నేత పుట్టినరోజును ఘనంగా నిర్వహించబోతున్నట్లు  జరుగుతున్న హడావిడిని చూస్తే తెలుస్తోంది.

మారమ్రోగుతున్న  పాటలు….

కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా ప్రియతమ నేతను అభివర్ణిస్తూ ఈవారంలో ఎన్నో పాటలు కూడా వచ్చాయి. పార్టీ శ్రేణులు తమ నాయకుడి కోసం పుట్టినరోజు పాటలను విడుదల చేస్తున్నారు. జై తెలంగాణ టీవీ (TV1) ఆధ్వర్యంలో ‘అరచేతిని అడ్డుగ పెట్టి సూర్యున్నే ఆపేశావు’ అంటూ కేసీఆర్‌పై  ఓ పాటను రూపొందించారు. ఈపాటలో కేసీఆర్ తెలంగాణకోసం ఎలా కష్టపడింది. తెలంగాణకు కేసీఆర్ చేస్తున్న  కృషి గురించి చెబుతూ పాటను కైగట్టారు. ప్రముఖ పాటల రచయిత కందికొండ  లిరిక్స్‌ను అందించగా..దాము కొసనం దర్శకత్వంలో  మంగ్లీ ఈ పాటను పాడింది. మరి పుట్టినరోజు వేడుకకు  ఇంకో రోజు మిగిలుండగానే  తెలంగాణ మొత్తం అప్పుడే సార్ బర్త్ డే సందడి మొదలైంది. ఇక రేపు పుట్టినరోజునాడు హంగామా ఇంకెలా వుండబోతుందో మరి.