హరితహారంలో ఎవరో గుర్తు పట్టారా? - MicTv.in - Telugu News
mictv telugu

హరితహారంలో ఎవరో గుర్తు పట్టారా?

February 17, 2018

ఇంకెవరు తెలంగాణను హరితహారంగా మార్చిన ముఖ్యమంత్రి కేసీఆరే.  కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా ఆయన అభిమాని రాజు అనే ఆర్టిస్ట్  చిన్న చిన్న మొక్కలతో ఇలా కేసీఆర్ ముఖం వచ్చేలా తీర్చిదిద్ది తన అభిమానాన్ని చాటుకున్నాడు.

 

అంతేకాదు హస్తినాపురానికి చెందిన సూక్ష్మ కళాకారుడు విద్యాధర్ కూడా సూది రంధ్రంలో ఇమిడే కేసీఆర్ బొమ్మను తయారు చేసి ప్రియతమ నేతపై తన అభిమానాన్ని చాటుకున్నాడు.  గతంలో తలవెంట్రుకలపై కూడా జై కేసీఆర్ జై తెలంగాణ అని రాసి  కేసీఆర్ కు అందించాడు ఈకళాకారుడు. ఇలా ఒక్కొక్కరు ఒక్కోరకంగా గులాబీ నేతపై తమ కళలతో అభిమానాన్ని చాటుకుంటున్నారు.