కేసీఆర్ ప్రచార హోరు… 4వ రోజు.. 3 జిల్లాల్లో సభలు…  

తెలంగాణ ఎన్నికల ప్రచారంలో ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ చాలా చురుగ్గా పాల్గొంటున్నారు. ప్రజాకర్షక ఉపన్యాసాలతో కేసీఆర్ దూసుకుపోతున్నారు. 6 రోజుతు 32 నియోజక వర్గాలను టార్గెట్‌గా పెట్టుకున్న కేసీఆర్ ఆ దిశగా వడివడిగా అడుగులు వేస్తున్నారు. 19 తేదీ మధ్యాహ్నం నుంచి ఆయన ప్రచారానికి దిగారు. ఈ మూడు రోజుల్లో ఖమ్మం, జనగామ, సిద్దిపేట, కరీంనగర్, సిరిసిల్ల, కామారెడ్డి, మహబూబ్ నగర్, నల్లగొండ, యాదాద్రి, మెదక్ తదితర జిల్లాలలో ప్రచారం చేశారు. నేడు ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్ జిల్లాల్లో బహిరంగ సభల్లో పాల్గొననున్నారు.Telugu news KCR campaign promotion ... 4th day .. houses in 3 districts … మూడు జిల్లాల షెడ్యూల్ ఇలా…

ఉదయం 11.15 గంటలకు హెలికాప్టర్‌లో నిర్మల్ జిల్లా ఖానాపూర్ చేరుకుంటారు. పట్టణ శివారులోని విద్యానగర్‌లో నిర్వహించే సభలో ప్రసంగిస్తారు. అనంతరం 12.35 గంటలకు ఖానాపూర్ నుంచి బోథ్ నియోజకవర్గంలోని ఇచ్చోడకు బయలుదేరి వెళ్తారు. మధ్యాహ్నం 1 గంటకు ఇచ్చోడ సభలో పాల్గొంటారు.

అక్కడి నుంచి నిర్మల్‌కు చేరుకుని మధ్యాహ్నం 2 గంటలకు ఎల్లపెల్లి క్రషర్‌రోడ్డులో నిర్వహించే బహిరంగసభలో ప్రసంగిస్తారు. మధ్యాహ్నం 2.35 గంటలకు నిర్మల్ నుంచి బయలుదేరి భైంసాకు వెళ్లి అక్కడి బహిరంగసభలో పాల్గొంటారు. 3.35 గంటలకు భైంసా నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరి నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌కు చేరుకుంటారు. అక్కడి మినీ స్టేడియంలో నిర్వహించే బహిరంగసభలో మాట్లాడుతారు. ఆయా నియోజక వర్గ అభ్యర్థులు అక్కడి ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు.