మోడీగాడు అని నేను అన్లేదు.. కేసీఆర్ - MicTv.in - Telugu News
mictv telugu

మోడీగాడు అని నేను అన్లేదు.. కేసీఆర్

March 3, 2018

ఇటీవల కేసీఆర్ తన ప్రసంగంలో ప్రధాన మంత్రిని మోడీని మోడీగాడు అన్నాడనే వార్త దేశవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. సోషల్ మీడియాలో, ఎలక్ట్రానిక్ మీడియాలో వార్తా పేపర్లలో ఎక్కడ చూసినా ఇదే వార్త దీని గురించే చర్చ. తెలంగాణ ముఖ్యమంత్రి  ప్రధానమంత్రిని పట్టుకుని ఏవవచంతో గాడుగీడు అని అన్నాడని బీజేపీ అగ్గిఫైరయిపోతోంది.

దీనిపై కేసీఆర్ స్పందించారు. శనివారం ఆయన ప్రగతిభవన్‌లో మీడియాతో మాట్లాడారు. ‘నేను మోడీని మోడీగాడని అన్నానని ఎవరికి ఇష్టం వచ్చినట్లు వాళ్లు రాసేశారు. నేను నిజానికి అలా అనలేదు. మోడీ గారనే అన్నాను. కావాలంటే ఆ వీడియోను రివైండ్ చేస్కొని చూస్కోండి. కాంగ్రెస్, బీజేపీ విధానాలను విమర్శిస్తూ నేను మాట్లాడాను.

నాకు మోడీ అంటే గౌరవం. కానీ నేను అనని దాన్ని పట్టుకుని పెద్ద రాద్ధాంతం చేసి, కేసీఆర్‌కు జైలుకు వెళ్లాలని ఉందా అని ఒకరంటరు. ఇంకోలు ఇంకేదో అంటరు. ప్రధాన మంత్రిని నేనైతే కించపర్చలేదు, అలా అనలేదు. బీజేపీ నాయకులు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి.మీ నేత గౌరవాన్ని మీరే తీయాలనుకుంటే, ప్రచారం చేసుకుంటే నేనేం చేయలేను. అనవసర విమర్శలు వద్దు… కొందరిని ముట్టుకుంటే భస్మం అయితరు’ అని కేసీఆర్ హెచ్చరించారు.

ప్రధాని మోదీని ఉద్దేశ్యపూర్వకంగా అవమానించాలనే ఉద్దేశం కేసీఆర్ లేదని, ఆయన కావాలని అలా అనలేదని మాటల మధ్య పొరపాట్లు దొర్లడం సహజం..దాన్ని పట్టుకుని బీజేపీ నేతలు పెద్దది చేయాలనుకోవడం సరికాదు అని కేసీఆర్ కూతురు  ఎంపీ కవిత కూడా స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.