mictv telugu

సహస్ర చండీ యాగం చేయనున్న కేసీఆర్.. 21నుంచి 25 వరకు

January 10, 2019

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈనెల 21 నుంచి 25 వరకు మహారుద్ర సహిత సహస్ర చండీ యాగం చేయనున్నారు. ఈ మహా క్రతువుకు ఎప్పటిలానే సిద్దిపేట జిల్లా ఎర్రవల్లిలోని తన వ్యవసాయ క్షేత్రమే వేదిక కానుంది. ఇందుకు సంబంధించిన పనులను వేగవంతం చేస్తున్నారు సీఎం. బుధవారం మధ్యాహ్నం వ్యవసాయ క్షేత్రానికి వెళ్లిన కేసీఆర్ స్వయంగా యాగం ఏర్పాట్లను పరిశీలించి తిరిగి హైదరాబాద్ పయనమయ్యారు. యాగంలో 200 మంది రుత్వికులు పాల్గొంటారు. సందర్శకులు, భక్తులను అనుమతించే విషయమై త్వరలోనే నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. యాగం ఏర్పాట్లను శృంగేరి పీఠం పండితులు ఫణిశశాంకశర్మ, అష్టకాల రామ్మోహన్‌శర్మ, గోపీకృష్ణశర్మ పర్యవేక్షిస్తున్నారు.Telugu news KCR doing sahasra chandi yagam… 21 to 25ఇటీవల ముఖ్యమంత్రి విశాఖ వెళ్ళి శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామి సలహాలు, సూచనలు కూడా తీసుకున్నారు. శృంగేరి పీఠాధిపతి భారతీ తీర్థస్వామి ఆశీరనుమతితో ఈ క్రతువును నిర్వహిస్తున్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత 2015లో అయుత చండీయాగం, శాసనసభ ఎన్నికలకు ముందు రాజశ్యామల యాగాన్ని సీఎం కేసీఆర్‌ తన వ్యవసాయ క్షేత్రంలో నిర్వహించిన విషయం తెలిసిందే.