భూపతిరెడ్డీ.. తీరు మార్చుకో... - MicTv.in - Telugu News
mictv telugu

భూపతిరెడ్డీ.. తీరు మార్చుకో…

October 26, 2017

టీఆర్‌ఎస్ శాసనసభ పక్ష సమావేశంలో దళపతి కేసీఆర్… ఎమ్మెల్సీ భూపతిరెడ్డిపై ఫైర్ అయ్యారు. భూపతిరెడ్డి స్ధానిక నాయకత్వాన్ని కలుపుకుని పోవడంలేదని, అక్కడున్న ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్థన్‌తో తరచూ గొడవపడడం కేసీఆర్ దృష్టికి వచ్చింది.

వాళ్లిద్దరి పంచాయితీ పోలీస్‌స్టేషన్‌కు చేరడంతో భూపతిరెడ్డిని ముఖ్యమంత్రి మందలించారు. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్థన్‌తో రాజీ కుదుర్చుకోవాలని, లేని పక్షంలో పార్టీ తరపున చర్య తీసుకోవాల్సి ఉంటుందని కేసీఆర్ అన్నట్టు తెలుస్తోంది.