రాయి లాంటి నన్ను నాతల్లిదండ్రులు,గురువులు సానబెట్టారు - MicTv.in - Telugu News
mictv telugu

రాయి లాంటి నన్ను నాతల్లిదండ్రులు,గురువులు సానబెట్టారు

December 15, 2017

ఈరోజు (శుక్రవారం)  ఎల్బీ స్టేడియంలో ప్రపంచ తెలుగు మహాసభలు ప్రారంభమయ్యాయి. ఈసభకు ఉపరాష్ట్రపతి వెంకయ్య, గవర్నర్ నరసింహన్ ,విద్యాసాగర్ రావ్ ముఖ్య అతిథితులుగా హాజరయ్యారు. ఈసందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ ‘ఎంత గొప్పవారికైనా అమ్మ ఒడే మొదటి బడి, తల్లి జోల పాటతోనే బిడ్డకు సాహిత్యాన్ని అలవాటు చేస్తుంది.

 చిన్నతనంలోనే మా అమ్మా నాన్నలు ఎన్నో పద్యాలు నేర్పారు. తల్లిదండ్రులే మనకు తొలి గురువులు. నా చిన్నతనంలో గురువులు శతకపద్యాల ద్వారా నీతి బోధించేవాళ్లు.  దుబ్బాకలో మృత్యుంజయ శర్మ సారు ఒక పద్యం చెబితే ఐదుసార్లు చదివి అప్పగించాను. రాయి లాంటి నన్ను మాగురువుగారు సాన బెట్టారు. వారి పుణ్యమా అని తొమ్మిదో తరగతిలోనే చెరువుగట్టుపై వృత్తపద్యాలు రాశాను. తెలంగాణ అద్భుతమైన సాహిత్యాన్ని పండించిన మాగాణం.  తెలుగు భాషా వికాసం, పరిరక్షణకు అందరం సంకల్పం తీసుకోవాలి’ అని కేసీఆర్  అన్నారు.