కేసీఆర్ ఆహ్వానిస్తే టీఆర్ఎస్‌లో చేరుతా - MicTv.in - Telugu News
mictv telugu

కేసీఆర్ ఆహ్వానిస్తే టీఆర్ఎస్‌లో చేరుతా

March 24, 2018

ముఖ్యమంత్రి కేసీఆర్ ఆహ్వానిస్తే తాను తప్పకుండా టీఆర్ఎస్‌లో చేరతానంటున్నారు ప్రముఖ నటుడు సుమన్.

భువనగిరిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘ గౌడ కులానికి సీఎం చేసిన మేలు మరువలేనిది. మా జాతికి చేసిన మేలుకు ఆయనకు పాదాభివందనం చేస్తున్నాను. గౌడజాతి మొత్తం ఆయనకు అండగా నిలిచి, రుణం తీర్చుకుంటుంది. పార్టీలో చేరేదాని మీద ఇంకా నిర్ణయం తీసుకోలేదు. నా నుంచి కేసీఆర్ ఎలాంటి సహాయం పొందాలనుకున్నా అందుకు నేను సిద్ధంగా ఉన్నాను ’ అని పేర్కొన్నారు. తెలంగాణకు కేసీఆర్ చేస్తున్న సేవలు మరువలేనివన్నారు. తెలుగు, తమిళ, హిందీ, ఒరియా, కన్నడ సినిమాల్లో నటిస్తూ బిజీగా వున్నానన్నారు.