కేసీఆర్ నా అభిమాన నాయకుడు.. సంపూ - MicTv.in - Telugu News
mictv telugu

కేసీఆర్ నా అభిమాన నాయకుడు.. సంపూ

November 27, 2017

మొన్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిసిన సంపూర్ణేష్ బాబు ఎట్టకేలకు ఆ కలయికకి ముడి  విప్పాడు తన ట్విట్టర్ ద్వారా. అభిమాన హీరోకి అభిమాన నాయకుడు అని సంపూ ట్వీట్‌కు కామెంట్లతో ముంచెత్తుతున్నారు నెటిజనులు. సంపూర్ణేష్ బాబు ( నర్సింహాచారి )కు కేసీఆర్‌ను కలవాలని ఎప్పటినుంచో కోరికట. అది సాకారం అవగానే అతని ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. సంపూ తన ట్వీట్‌లో ఏం రాశాడంటే..

‘ తెలంగాణ ముఖ్యమంత్రి నా అభిమాన నాయకుడు. నేను ఆయనకు పెద్ద ఫ్యాన్‌ను. ఆయనను కలవాలని ఎప్పటినుంచో అనుకుంటున్నాను. ఆ కల ఇన్నేళ్ళకు నెరవేరింది. మంత్రి కేటీఆర్ గారిని కూడా కలవడం నేను అదృష్టంగా భావిస్తున్నాను. వారి అమూల్యమైన ప్రేమకు సదా నేను బానిసను ’ అంటూ తన అభిమానాన్ని ట్వీట్‌లో పేర్కొన్నాడు సంపూ. ఈ సందర్భంగా కేసీఆర్‌తో దిగిన ఫోటోను షేర్ చేశాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నది.