mictv telugu

బెంగాల్, ఏపీ హోదా విషయంలో కేసీఆర్ మౌనం.. ఎందుకంటే…

February 12, 2019

కొద్ది రోజులుగా జాతీయ రాజకీయాలు వేడెక్కాయి. ముఖ్యమంత్రులు, ముఖ్య నాయకులు అంతా ఏదో విషయంపై మాట్లాడుతూనే ఉన్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే మోదీ వర్సెస్ అదర్స్  అన్నట్లుగా తయారైంది రాజకీయ పరిస్థితి. వీరికంటే ముందు చాలా విషయాల గురించి మాట్లాడిన కేసీఆర్ ఇప్పుడు మౌనంగా ఉన్నారు. ఎవరి గురించి మాట్లాడటం లేదు. పైగా మోదీకి మద్దతునీయడం లేదు. అలాగని మమతపై విమర్శలూ చేయడం లేదు.

ప్రత్యేక హోదా గురించి మాట్లాడిన సందర్భంలో ఆయనో మాట అన్నారు. హోదా విషయంలో మద్దతునిస్తామని.. అయితే  విభజన చట్టం ప్రకారం తెలంగాణకూ న్యాయం చేయాలనేది ఆయన చెప్పిన మాట. ఏపీకి హోదా ఇస్తే ప్రత్యేక సదుపాయాలు తెలంగాణకూ ఇవ్వాల్సి ఉంటుంది. కేసీఆర్ ఈ మెలిక పెట్టే వరకు ఏపీకి చెందిన నాయకులు ఎవ్వరూ ఏమీ అనలేకపోతున్నారు.

Telugu news KCR is silent about Bengal and AP status .. Because …  ......

 

అంతేకాదు దేశ రాజకీయాల గురించి అందరికంటే ముందుగా మాట్లాడింది కేసీఆర్. ఆ తర్వాత అందరూ మాట్లాడుతున్నారు. కేసీఆర్ మౌనంగా ఉన్నారు. ఎందుకూ అనే  సందేహం చాలా మంది వ్యక్తం చేస్తున్నారు. దాంతోపాటుగా ఆయన చెప్పిన మాటలు, ఆచరణ అంతా తర్వాత తర్వాత అందరూ అనుకరిస్తున్నారు. జాతీయ స్థాయిలో రాజకీయాలు మారుతాయని, మార్చాల్సిన అవసరం ఉందని కేసీఆర్ తొలుత చెప్పారు.

ఆయన చాలా మంది నాయకులను కలిశారు. వాళ్లు ఎవ్వరు కూడా కేసీఆర్  ఎందుకు స్పందించడం లేదని అడగటం లేదు. ఎందుకంటే జాతీయ రాజకీయాల గురించి, జాతీయ పార్టీల పని తీరు గురించి అందరితో ఆయన చర్చించారు. ముందు ముందు ఏ రాజకీయ కార్యాచరణ తీసుకోవాలో వారికి చెప్పారు. కేసీఆర్ రాజకీయ వ్యూహాం వారికి  మంచిగా అర్థం అయి ఉంటుంది. అందుకే ఎవ్వరూ ఏమీ అనడం లేదు.

పైగా ఇప్పుడు జరుగుతున్న పంచాయతీ అంతా ఇద్దరు ముగ్గరు ముఖ్యమంత్రులు, ప్రధాన మంత్రికి మధ్య అన్నట్లుగా ఉంది పరిస్థితి. అందుకే కేసీఆర్ ఏమీ అంటున్నట్లు లేదు. బెంగాల్‌ విషయంలో ఇద్దరు నాయకులు  రాజకీయ మైలేజ్ కోసం పోటీలుపడి ఎత్తుకు పై ఎత్తులు వేసుకున్నారు. విమర్శలు, ప్రతి విమర్శలు చేసుకున్నారు. దేశ ప్రయోజనాల కంటే ఇద్దరు నాయకుల వ్యక్తిగత ప్రయోజనాలే ఎక్కువగా ఉన్నాయి. అంతేకాదు పార్లమెంట్ ఎన్నికల ముందు జరిగిన ఘటన కావడంతో కేసీఆర్ ఎటూ చెప్పలేదు. తెలంగాణ ప్రయోజనాలకు ఇబ్బంది కలుగుతుందని భావించినప్పుడు  ఆయన తప్పకుండా మాట్లాడతారు. అంతేకాదు ఎవ్వరితోనైనా, ఎంత వరకైనా వెళ్లేందుకు ఆయన ఒక్క అడుగు కూడా వెనక్కు వేసే ప్రసక్తే లేదు.

చాలా సందర్భాల్లో మోదీపైనా  విమర్శలు చేశారు. రాహుల్ గాంధీనీ ఓ మాట అన్నారు. అది కూడా  తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలకు ఇబ్బంది వస్తుందని ఆయన భావించినప్పుడు మాత్రమే.  చంద్రబాబు విషయంలో కూడా ఆయన విమర్శలు చేసింది తెలంగాణ ప్రయోజనాలకు ఇబ్బంది కలుగుతుందని భావించినప్పుడు మాత్రమే. ఈ విషయమూ చంద్రబాబుకు కూడా తెలుసు. అందుకే  కేసీఆర్ గురించి ఘాటు విమర్శలు చేయడానికి సాహసించడం లేదు. కేవలం రాజకీయంగా నాలుగు మాటలు అంటున్నారు. కానీ పిన్ పాయింట్‌గా ఒకటి రెండు అంశాలను బేరీజు వేసుకుని చెప్పలేకపోతున్నారు.

రాజకీయంగా అన్నీ పార్టీలు ఎవరి ప్రయోజనాల కోసం వారు మాట్లాడుతున్నారు. కాబట్టే కేసీఆర్ ఇప్పుడు ఏమీ అనడం లేదని, నిజంగానే దేశ రాజకీయాల గురించిన కీలక అంశంపై చర్చ చేసినప్పుడు అందరికంటే ముందు తానే ఉండే అవకాశం ఉంది. పార్టీల ప్రయోజనాలు, వ్యక్తుల ప్రయోజనాల కోసం ఆందోళనలు జరుగుతున్నప్పుడు మౌనంగా ఉండటమే మేలని కేసీఆర్ భావించినట్లుందని ఆయన గురించి  తెల్సినవారు చెబుతున్న మాట.

Telugu news KCR is silent about Bengal and AP status .. Because …