జగిత్యాలలో తండాకు కేసీఆర్ పేరు - MicTv.in - Telugu News
mictv telugu

జగిత్యాలలో తండాకు కేసీఆర్ పేరు

January 8, 2019

రోజురోజుకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మీద ప్రజల్లో అభిమానం పెరుగుతూ వుంది. ఆయన తీసుకుంటున్న నిర్ణయాలతో ప్రజల్లో మరింత అభిమానాన్ని మూట గట్టుకుంటున్నారు. రాష్ట్రంలోని గిరిజన తండాలను పంచాయతీలుగా మారుస్తూ టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం తీసుకున్న చర్యను హర్షిస్తూ ఓ పంచాయతీ వాసులు తమ తండాకు ఏకంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ పేరు పెట్టేశారు.  ‘కేసీఆర్‌ తండా’ అని ఆ తండాకు నామకరణం చేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు తండావాసులు.Telugu news KCR is the name of Thanda in Jagityalజగిత్యాల జిల్లా మెట్‌పల్లి మండంలో వుంది ఆ తండా. ఆ తండా పేరు రంగారావు తండా. ఇకనుంచి అది కేసీఆర్ తండాగా పిలవబడుతుంది. ఇందుకు సంబంధించిన బోర్డు కూడా వెలసింది. గతేడాది ఆగస్టు 2వ తేదీన కేసీఆర్‌ ప్రభుత్వం తండాలకు పంచాయతీలుగా గుర్తింపు ఇస్తూ ప్రకటన జారీ చేసిన విషయం తెలిసిందే. దీంతో తండావాసుల్లో హర్షం వ్యక్తం అయింది.