స్నేహమేరా జీవితం-స్నేహమేరా శాశ్వతం అంటున్న కేసీఆర్ - MicTv.in - Telugu News
mictv telugu

స్నేహమేరా జీవితం-స్నేహమేరా శాశ్వతం అంటున్న కేసీఆర్

November 25, 2017

పరిపాలనను కాసేపు పక్కన పెట్టి  కేసీఆర్ తన ప్రాణ స్నేహితుడితో సేద తీరారు. అనారోగ్యంతో బాధపడుతున్న  స్నేహితుడిని  కలవడానికి ముషీరాబాద్‌లోని ఆయన ఇంటికి వెళ్లారు. కేసీఆర్ కాంగ్రెస్‌లో ఉన్నప్పుడు కె. రాజేంద్రప్రసాద్ పరిచయం అయ్యారు.

అప్పటినుండి ఇద్దరు కలిసి యువజన కాంగ్రెస్ కోసం పనిచేశారు. 1977-78 ప్రాంతంలో కేసీఆర్, రాజేంద్రప్రసాద్ ఇద్దరు కలిసి  యూత్ కాంగ్రెస్‌లో క్రియాశీలకంగా పని చేశారు. ఆతర్వాత  కేసీఆర్ టీడీపీలోకి వెళ్లడం, దాని తర్వాత  ‘తెలంగాణ రాష్ట్ర సమితి’ పార్టీ పెట్టిన విషయం తెలిసిందే.  కె. రాజేంద్రప్రసాద్  గుంటూరు జిల్లా రేపల్లె నుంచి  కాంగ్రెస్  తరపున mla గా పోటీ చేసి ఓడిపోయారు. అయితే  ఇన్ని సంవత్సరాలు గా  వీరిద్దరి స్నేహం కొనసాగుకుంటూ వస్తుంది.

ముఖ్యమంత్రిగా ఎంతో బిజీగా ఉండే స్నేహితుడు కేసీఆర్, తనను చూడడానికి  రావడంపై రాజేంద్రప్రసాద్  ఎంతో  సంతోషం వ్యక్తం చేశారు.  తన స్నేహితుడు  కేసీఆర్‌కు  తన కుటుంబ సభ్యులను ఒక్కొక్కరిని పరిచయం చేశారు.  

కేసీఆర్ ఇంటికి రావడంపై  రాజేంద్రప్రసాద్  కుటుంబసభ్యులు కూడా ఎంతో ఆనందాన్ని  వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి హోదాలో ఉన్న కేసీఆర్ తన స్నేహితులను కానీ, చదువు చెప్పిన ఉపాధ్యాయులను కానీ చూసినప్పుడు  పాతరోజుల్ని గుర్తుచేసుకుంటూ చలించి పోతుంటారు. ఉపాధ్యాయులు కనపడితే  అది ఇల్లా, స్టేజా, లేక ఏదైనా కార్యక్రమం అని ఆలోచించకుండా  కేసీఆర్ వాళ్ల  కాళ్ల మీద పడి మొక్కుతాడు. పాత స్నేహితులు కనపడితే గుండెలకు హత్తుకుంటాడు.