ఈబీసీ బిల్లుకు సవరణలు కోరాలని కేసీఆర్ ఆదేశం…

ఈబీసీలకు 10 శాతం రిజర్వేషన్ కేటాయిస్తూ కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో ప్రవేశపెట్టే బిల్లులో సవరణలు కోరాలని టీఆర్ఎస్ ఎంపీలను ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. తెలంగాణ రాష్ట్రంలో ముస్లింలలో వెనుకబడినవారికి 12 శాతం రిజర్వేషన్, ఎస్టీలకు 10 శాతం రిజర్వేషన్ కేటాయిస్తూ తెలంగాణ అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్రానికి పంపింది. ఈ తీర్మానాన్ని పార్లమెంటులో పెట్టాల్సి వుంది. ఇప్పుడు కేంద్రం రిజర్వేషన్ల పెంపు అంశాన్ని చేపట్టినందున ఈ బిల్లులో తెలంగాణ రిజర్వేషన్ల పెంపు అంశాన్ని కూడా చేర్చాలని, కేంద్రాన్ని కోరాలని సీఎం ఆదేశించారు. బిల్లుల సవరణ తెచ్చి తెలంగాణ రాష్ట్ర డిమాండును నెరవేర్చాలని పట్టుబట్టాలని కేసీఆర్ వాళ్లకు ఆదేశించారు.Telugu news KCR ordered to amend the EBC bill