హరీష్‌రావ్ ఉషారైండు: కేసీఆర్ - MicTv.in - Telugu News
mictv telugu

హరీష్‌రావ్ ఉషారైండు: కేసీఆర్

October 11, 2017

సిద్దిపేట జిల్లా  కొండపాక మండలం దుద్దెడలో జిల్లా కార్యాలయ సముదాయం, పోలీస్‌ కమిషనరేట్ నిర్మాణాలకు సీఎం కేసీఆర్ బుధవారం శంకుస్థాపన చేశారు. అనంతరం  సిద్ధిపేటలో ఏర్పాటు చేసిన బహిరంగసభలో  కేసీఆర్ మాట్లాడారు.  ‘ఈమధ్య హరీష్ రావ్ బాగా ఉషారైండు, మొదట  సిద్దిపేటను జిల్లా చేస్తే చాలు అన్నడు..  ఆ తర్వాత  ఇంకా కొన్ని  అభివృద్ధి పనులు కూడా సిద్దిపేటకు అవసరమని  చెప్పి అన్ని దగ్గరుండి చేపిచ్చుకుండు.  కోమటి చెరువును  మంచిగ అభివృద్ది  జేశినరు. దాని అభివృద్ధికోసం ఇంకా నిధులను కూడా ఏర్పాటు చేస్తం’ అని కేసీఆర్ చెప్పారు.. అంతేకాదు  మెడికల్ కాలేజీతో పాటు ఇంకా సిద్దిపేటలో ఏం ఏం అవుసరమో అన్ని చేస్తామని అన్నారు.  గోదావరి నీళ్లు త్వరలోనే రంగనాయకి చెరువులోకి వస్తాయని,  సిద్దిపేటకు ఎంత చేసినా తక్కువేనని అని కేసీఆర్ అన్నారు.