బీసీల‌కు కేసీఆర్ దీపావ‌ళి కానుక‌ - MicTv.in - Telugu News
mictv telugu

బీసీల‌కు కేసీఆర్ దీపావ‌ళి కానుక‌

October 20, 2017

తెలంగాణ ముఖ్య‌మంత్రి క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర్‌రావు వెనుకబడిన వర్గాలకు దీపావ‌ళి కానుక‌ను అంద‌జేశారు. బీసీలకు రూ. 102.8 కోట్ల సబ్సిడీ రుణాలను మంజూరు చేస్తూ.. దానికి సంబంధించిన ఫైలుపై శుక్ర‌వారం సంత‌కం చేశారు. ఈ స‌బ్సిడీ రుణాల వ‌ల్ల రాష్ట్రవ్యాప్తంగా 12,218 మందికి ల‌బ్ధి చేకూర‌నుంది. స‌బ్సిడీ రుణాల మంజూరపై బీసీ సంక్షేమ శాఖ మంత్రి జోగు రామ‌న్న హ‌ర్షం వ్య‌క్తం చేశారు. ఈ స‌బ్సిడీ నిధుల‌ను 12 ఫెడ‌రేష‌న్స్‌కు చెందిన ల‌బ్ధిదారుల‌కు స‌త్వ‌ర‌మే అంద‌జేస్తామన్నారు. బీసీల‌ను అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్ల‌డ‌మే ప్ర‌భుత్వ ధ్యేయ‌మ‌ని ఆయ‌న అన్నారు. స్వ‌యం ఉపాధి ద్వారా బీసీ వ‌ర్గాలు మెరుగైన జీవ‌నాన్ని సాధించాల‌న్న‌దే ప్ర‌భుత్వ ల‌క్ష్య‌మ‌ని రామ‌న్న పేర్కొన్నారు.

2015-16 ఆర్థిక సంవ‌త్స‌రానికి సంబంధించిన ఈ స‌బ్సిడీ రుణాలు

 బీసీ కార్పొరేష‌న్‌కు చెందిన 8,835 మంది ల‌బ్ధిదారుల‌కు  రూ.71.73 కోట్లు,

నాయి ఫెడ‌రేష‌న్‌కు చెందిన 906 మంది ల‌బ్దిదారుల‌కు రూ.8.40 కోట్లు

కుమ్మ‌రి వ‌ర్గాల‌ 806 మందికి రూ.6.79 కోట్లు

విశ్వ బ్రాహ్మ‌ణ వ‌ర్గాల 523 మందికి రూ.5.09 కోట్లు

వ‌డ్డెర వ‌ర్గాల 269 మందికి రూ. 2.42 కోట్లు

ర‌జ‌క వ‌ర్గాల 216 మందికి రూ.1.95 కోట్లు

గీత కార్మిక వ‌ర్గాల 138 మందికి రూ. 1.40 కోట్లు

స‌గ‌ర (ఉప్ప‌ర‌) వ‌ర్గాల 124 మందికి రూ.1.24 కోట్లు

కృష్ణ బ‌లిజ (పూస‌ల‌) వ‌ర్గాల 151 మందికి రూ. 1.22 కోట్లు

మేద‌ర వ‌ర్గాల 187 మందికి రూ. 1.21 కోట్లు

వాల్మికీ (బోయ‌) వ‌ర్గాల 33 మందికి రూ. 33 ల‌క్ష‌లు

భ‌ట్రాజు వ‌ర్గాల 30 మందికి రూ. 30 ల‌క్ష‌లు