కేసిఆర్ తెలంగాణ గాంధీ.. - MicTv.in - Telugu News
mictv telugu

కేసిఆర్ తెలంగాణ గాంధీ..

September 13, 2017

‘ మన మాతృ భాష తెలుగును పాఠశాలల్లో తప్పనిసరి సబ్జెక్టుగా బోధించాలని సంకల్పించిన మన తెలంగాణ గాంధీ కేసీఆర్ గారికి నా అభినందనలు ’ అంటూ ట్వీట్ చేశాడు సినీ నటుడు మంచు మనోజ్. ప్రపంచ తెలుగు మహాసభల ఏర్పాటు గురించి సీఎం కేసీఆర్ తెలుగు భాష గురించి ఆయన ప్రకటించిన తీరును ప్రశంసిస్తూ మనోజ్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా వెళ్ళడించాడు.

వచ్చే విద్యా సంవత్సరం నుండి అన్నీ విద్యా సంస్థల్లో ఒకటి నుండి ఇంటర్మీడియట్ వరకు తెలుగు సబ్జెక్టు తప్పనిసరిగా వుండాలని, అలాగే వివిధ ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల బోర్డులు తెలుగులోనే వుండాలని సూచించడం ఎంతో హర్షించదగ్గ విషయమని చెప్పాడు మనోజ్. నిజమే తమిళనాడు ప్రభుత్వం ఎప్పటినుండో వాళ్ళ భాషను కాపాడుకోవడానికి ఇలాంటి పని చేస్తోంది.

అక్కడ సినిమా టైటిళ్ళు కూడా తమిళంలోనే వుండాలనే ఆంక్షలున్నాయి. మన దగ్గర కూడా మాతృభాష మీద ప్రేమను పెంచే దిశలో ముఖ్యమంత్రి తీస్కున్న నిర్ణయం మనోజ్ కు బాగా నచ్చినట్టుంది. అందుకే అభినందించకుండా వుండలేకపోయాడు.