కేసీఆర్ థర్డ్‌ఫ్రంట్‌కు వివిధ రాష్ట్రాల సీఎంల మద్దతు - MicTv.in - Telugu News
mictv telugu

కేసీఆర్ థర్డ్‌ఫ్రంట్‌కు వివిధ రాష్ట్రాల సీఎంల మద్దతు

March 5, 2018

‘ దేశంలో మార్పు రావాల్సిన అవసరం చాలా వుంది. అది తెలంగాణ నుంచే మొదలవ్వాలి. థర్డ్ ఫ్రంట్ విషయంలో భావ సారూప్యత వున్న నేతలతో త్వరలో మాట్లాడతా ’ అని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతిభవన్‌లో వ్యాఖ్యానించగా.. వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఫోన్లు చేసి అభినందిస్తున్నారు. బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ముఖ్యమంత్రికి తోడుగా నిలుస్తానన్నారు. జార్ఖండ్ ముఖ్యమంత్రి, ఆరుగురు మహారాష్ట్ర ఎంపీలు సైతం కేసీఆర్‌కు సంఘీభావం పలికారు. ‘ నాలుగేండ్ల కేసీఆర్ పాలన భేష్. దేశంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలిపారు. దేశానికి కేసీఆర్ వంటి నేతల అవసరం చాలా వుంది ’ అని ఎంఐఎం పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. థర్డ్‌ఫ్రంట్‌కు కేసీఆర్ నాయకత్వానికి నా మద్దతు వుంటుందని జనసేన నేత పవన్ కల్యాణ్ అన్నారు.