సమ్మక్క-సారక్కలు ఈరోజు గద్దెల మీదికి వచ్చారు. ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్.. అమ్మవార్లను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్న విషయం తెలిసిందే. కుటుంబ సమేతంగా మేడారం వెళ్లిన కేసీఆర్ నిలువెత్తు బంగారాన్ని(బెల్లం) తులాభారం తూగి అమ్మవార్లకు సమర్పించి మొక్కు తీర్చుకున్నారు.
ఆ తర్వాత కేసీఆర్ వనదేవతలకు పట్టువస్త్రాలు సమర్పించారు. గద్దెల వద్దకు బంగారాన్ని మోసుకెళ్లి సమక్మ సారక్కలకు సమర్పించారు. కేసీఆర్ వెంట ఆయన భార్య శోభ, మనవడు హిమాన్షు, డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, స్పీకర్ మధుసూదనాచారి, మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, పలువురు ప్రజాప్రతినిధులు అమ్మవార్లను దర్శించుకున్నారు. తెలంగాణలో నిర్మిస్తున్న సాగునీటి ప్రాజెక్టులు తొందరగా పూర్తయ్యేలా చూడాలని, వాటికి ఆటంకాలు రాకుండా చూడాలని అమ్మవార్లను కోరుకున్నట్లు కేసీఆర్ చెప్పారు.