స్పీడ్ పెంచిన కేసీఆర్… నేడు నాలుగు సభల్లో… - MicTv.in - Telugu News
mictv telugu

స్పీడ్ పెంచిన కేసీఆర్… నేడు నాలుగు సభల్లో…

November 20, 2018

గులాబీ దళపతి ప్రచార వేగాన్ని పెంచారు. ఎన్నికల్లో కారును హైస్పీడులో పరుగెత్తించాలని కంకణం కట్టుకున్నారు. మొదటి నుంచి భారీ ప్రచారానికి సిద్ధమైన ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్, సోమవారం రెండు సభల్లో పాల్గొన్నారు. మంగళవారం  నాలుగు సభల్లో పాల్గొనబోతున్నారు.Telugu News Kcr to attend in four meetings todayనేడు కేసీఆర్ సభలు..

  • మధ్యాహ్నం ఒంటిగంటకు సిద్ధిపేట జిల్లాలోని సిద్దిపేట, దుబ్బాక నియోజకవర్గాలకు కలిపి సిద్దిపేటలో నిర్వహించే సభకు కేసీఆర్ హాజరవుతున్నారు.
  • మధ్యాహ్నం 2.30లకు ఈటల రాజేందర్ పోటీచేస్తున్న హుజూరాబాద్ నియోజకవర్గ ప్రచార సభలో పాల్గొంటారు.
  • మధ్యాహ్నం 3.30 సిరిసిల్ల జిల్లాలోని సిరిసిల్ల, వేములవాడ నియోజకవర్గాలకు కలిపి సిరిసిల్లలో నిర్వహించే సభకు కేసీఆర్ హాజరవుతున్నారు.
  • సాయంత్రం 4.30 కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గ సభలో పాల్గొనబోతున్నారు.

ఈనెల 25లోగా, వరుసగా 26 సభల్లో పాల్గొనేలా ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు.