కేంద్ర నిధులను కాజేసిన కేసీఆర్‌.. బీజేపీ - MicTv.in - Telugu News
mictv telugu

కేంద్ర నిధులను కాజేసిన కేసీఆర్‌.. బీజేపీ

February 28, 2018

‘ అధికారంలోకి వచ్చి నాలుగు సంవత్సరాలు అయినప్పటికీ కేసీఆర్ చేసిందేమీ లేదు. కేంద్ర నిధులను పక్కదారి పట్టించిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుంది ’ అంటూ బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ మండిపడ్డారు. ప్రజలను తన మాటలతో గారడీ చేస్తూ, అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపించారు.కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఇచ్చిన నిధులపై లెక్కలు చూపాలని లక్ష్మణ్ డిమాండ్ చేశారు.                   కాంట్రాక్టర్ల లాభాల కోసమే కేసీఆర్ సర్కార్ పని చేస్తోంది. సింగరేణి, కాంట్రాక్ట్ ఉద్యోగాల సంగతి ఏం చేశారు. ప్రధాని నరేంద్ర మోడీపై, కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేసే ముందు తమ ప్రభుత్వ పనితీరు సరిగ్గా వుందో లేదో చూసుకోవాలి. కేసీఆర్ మాటలు పరాకాష్టకు చేరాయి ’ అని విరుచుకుపడ్డారు.